Breaking News

విదేశీ విద్యార్థులకు కెనడా ఝలక్‌.. స్టడీ పర్మిట్లలో భారీ తగ్గుదల

Published on Fri, 05/23/2025 - 10:21

న్యూఢిల్లీ: కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు షాక్‌ తగిలింది. స్టడీ పర్మిట్‌లలో పోనుపోను భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. తాజాగా వెల్లడైన ఇమిగ్రేషన్‌, రెఫ్యూజీస్‌ అండ్ సిటిజన్‌షిప్‌ కెనడా (IRCC) గణాంకాలు ఈ వివరాలను తేటతెల్లం చేశాయి.

2025 తొలి త్రైమాసికానికిగానూ కేవలం భారతీయ విద్యార్థుల కోసం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ అయ్యాయి. అయితే కిందటి ఏడాది ఇదే సమయంలో 44, 295 పర్మిట్లు జారీ అయ్యాయి. అంటే.. దాదాపు 31 శాతం తగ్గిందన్నమాట.

2023 చివరి నుంచి వలసదారుల రాకను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే.. స్టడీ పర్మిట్లను తగ్గిస్తూ వస్తున్నారు. రికార్డు స్థాయిలో వలసల వల్ల కెనడాపై అన్ని రకాలుగా తీవ్ర భారం పడుతోందని అక్కడి లిబరల్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే.. 2028 నాటికల్లా కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులు, విదేశీ ఉద్యోగులు.. విద్యార్థులు కలిపి 5 శాతానికి మించి ఉండకూదంటూ ప్రధాని మార్క్‌ కార్నీ ఒక ప్రకటన చేశారు.

ఇక గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్‌లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

  • 2023లో.. కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. ఇందులో భారతీయులకు జారీ చేసింది 2, 78,045

  • 2024కి వచ్చేసరికి.. మొత్తం 5,16,275 పర్మిట్లు జారీ చేయగా.. అందులో భారతీయుల కోసం జారీ చేసింది 1,88,465

  • 2025 నాటికి.. ఈ ఏడాదికిగానూ తొలుత 4,85,000 పర్మిట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 4,37,000 పర్మిట్లు మాత్రమే జారీ చేయాలని ఐఆర్‌సీసీ ఇప్పుడు భావిస్తోంది. ఇందులో భారతీయల పర్మిట్ల సంఖ్యను లక్షకు పరిమితం చేయాలని భావిస్తోందని స్పష్టమవుతోంది. 

  • 2026 కల్లా.. ఈ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గించే యోచనలో ఉంది. మరోవైపు స్టడీ పర్మిట్ల దరఖాస్తుల కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా మారాయి.

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)