Breaking News

కాలిఫోర్నియా రాష్ట్ర సెలవుగా దీపావళి

Published on Thu, 10/09/2025 - 04:59

న్యూయార్క్‌: అమెరికాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ మేరకు కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ మంగళవారం అసెంబ్లీ సభ్యుడు ఆష్‌ కల్‌రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసి, దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. అక్టోబర్‌ 2024లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించిన పెన్సిల్వేనియా మొదటి రాష్ట్రంగా నిలవగా, ఈ సంవత్సరం కనెక్టికట్‌ ఆ తర్వాతి స్థానంలో ఉంది. 

న్యూయార్క్‌ నగరంలో పబ్లిక్‌ పాఠశాలలకు దీపావళిని సెలవుగా ప్రకటించారు. ‘భారతీయ అమెరికన్లు మరింత సాంస్కృతిక సమ్మిళితం, గుర్తింపు దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. ఈ గుర్తింపు దీపావళి జీవకళనే కాదు, యునైటెడ్‌ స్టేట్స్‌లో భారతీయ అమెరికన్ల శాశ్వత ప్రభావాన్ని కూడా ప్రతిబింబిస్తుంది’.. ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ఎంఆర్‌ రంగస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిల్లు సహ రూపకర్త అయిన అసెంబ్లీ సభ్యురాలు డాక్టర్‌ దర్శనా పటేల్‌ను అభినందించారు.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)