Breaking News

మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు

Published on Fri, 08/04/2023 - 08:39

మెక్సికో సిటీ: దక్షిణ మెక్సికోలో గురువారం తెల్లవారుజామున ప్యాసింజర్లతో హైవేపై వెళ్తోన్న ఎలైట్ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా అందులో ఆరుగురు భారతీయులున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు మెక్సికో అధికారులు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో వేర్వేరు దేశాలకు చెందిన వారితో పాటు కొంతమంది అమెరికా సరిహద్దు ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు అధికారులు.

మెక్సికో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సరిహద్దులోని తెపిక్ ప్రాంతంలో బారాంకా బ్లాంకా హైవేపై టిజువానా ఉత్తర సరిహద్దు వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదే స్పీడులో టర్నింగ్ తిరగడంతో ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయిందని.. అందులో డామినిక్ రిపబ్లిక్, భారత్, ఆఫ్రికా దేశాలకు చెందిన 42 మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. వీరిలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మందిని మాత్రం చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించమని వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు నయారిట్ అధికారులు.  

నయారిట్ భద్రతా, పౌర రక్షణ కార్యదర్శి జార్జ్ బెనిటో రోడ్రిగ్జ్ మాట్లాడుతూ బస్సు లోయలో సుమారు 40 మీటర్లు(131 అడుగులు) లోతుకు వెళ్లిపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగానే సాగుతున్నాయన్నారు. ఎలైట్ బస్సు కంపెనీ వారి నుంచి కానీ, మెక్సికో మైగ్రేషన్ వారి నుంచి కానీ సంఘటనపై ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదని అన్నారు.

ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాల్లో ఇది మూడోది. ఫిబ్రవరిలో సెంట్రల్ మెక్సికోలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. అందులో 17 మంది మృతిచెందగా గత నెల దక్షిణ రాష్ట్రమైన ఒక్సాకాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 29 మంది మృతి చెందారు. 

ఇది కూడా చదవండి: యుద్ధ మృతులు 10 వేలు.. ఓ రక్తపిపాసీ... నీకిదే జలాభిషేకం...!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)