Breaking News

ఇజ్రాయెల్ చేరుకున్న రిషి సునాక్.. నెతన్యాహుతో చర్చలు

Published on Thu, 10/19/2023 - 12:44

జెరూసలేం: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌లతో సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిన్న ఇజ్రాయెల్‌లో పర్యటించారు. గాజా ఆస్పత్రి దాడి అంశంలో ఇజ్రాయెల్‌ వాదనకు మద్దతు తెలిపారు. బైడెన్ పర్యటన అనంతరం యుద్ధంలో ఇజ్రాయెల్ కాస్త పట్టు సడలించినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చిన్నాభిన్నమైన గాజాకు ఆహారం, నీటిని  రాఫా సరిహద్దు గుండా సరఫరా చేయడానికి అనుమతించారు. 

గాజాలో ఆస్పత్రిపై రాకెట్ దాడులు జరిపింది హమాస్ దళాల పనే అని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బహిర్గతం చేసింది. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ వాదనలకు అమెరికా మద్దతుగా నిలిచింది. అటు.. గాజా ఆక్రమణ దిశగా ఇజ్రాయెల్ ఆలోచన సరైంది కాదని తెలుపుతూనే యుద్ధంలో కాల్పుల విరమణ వైపు ఆలోచించాలని అమెరికా కోరింది. ఆ తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై దాడులు చేశాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. గాజాలో నక్కిన హమాస్ దళాలను అంతం దిశగా ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఇరుపక్షాల వైపు దాదాపు 4000 మంది మరణించారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయాలని కోరుతున్నాయి.

ఇదీ చదవండి: బైడెన్‌ చొరవ.. ఈజిప్ట్‌ గ్రీన్‌సిగ్నల్‌.. గాజాకి అందనున్న మానవతా సాయం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)