Breaking News

ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..

Published on Sat, 01/04/2025 - 17:15

మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్‌ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని.. తమలాంటి మరెందరో భారీకాయులకు స్ఫూర్తిని కలిగించిన వాళ్లు మన చుట్టూరానే కనిపిస్తుంటారు. వాళ్లలో గాబ్రియల్‌ ఫెయిటస్‌ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ జర్నీ ఇప్పుడు అర్థాంతరంగా ముగిసింది.

ఈ లడ్డూ బాబు(Laddu Babu) ఏకంగా 174 కేజీల బరువు తగ్గి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బ్రెజిల్‌కు చెందిన గాబ్రియల్‌ ఫెయిటస్‌. ఓ టీవీ షో ద్వారా అతని వెయిట్‌లాస్‌ జర్నీ పాపులర్‌ అయ్యింది. బరువు తగ్గాలనుకువాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచింది. 

‘‘హాయ్‌.. నాపేరు గాబ్రియల్‌(Gabrial). వయసు 29 ఏళ్లు. ఒకప్పుడు నేను 320 కేజీల బరువు ఉండేవాడిని. ఎలాంటి సర్జరీలు లేకుండా, మందులు వాడకుండా బరువు తగ్గేందుకు నేను ప్రయత్నించా. ఆ ప్రయాణం మీరు చూడడండి..’’ అంటూ ఎనిమిదేళ్ల కిందట అతను పోస్ట్‌ చేసిన వీడియో తెగ వైరల్‌ అయ్యింది. 2017లో ‘ప్రోగ్రామ డు గుగు’లో విరౌ ఔట్రా పెస్సావో(మరో వ్యక్తిగా మారడం) సెగ్మెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడితను. అంతేకాదు.. బరువు తగ్గాలనుకునే ఎందరికో అతని పాఠాలు స్ఫూర్తిగా నిలిచాయి కూడా.

అయితే ఆ తర్వాత ఆ ఫేమ్‌ ఎంతో కాలం నిలవలేదు. తండ్రిని, సోదరుడిని కోల్పోయాక మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధలో లడ్డూ బాబు మునుపటి అంతలా కాకపోయినా కాస్త బరువు పెరిగాడు. చివరకు డిసెంబర్‌ 30వ తేదీన నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితుడు ప్రకటించారు. ‘‘మా వాడి మనసు బంగారం. ఎందరికో వాడి ప్రయాణం ఇన్‌స్పిరేషన్‌. అలాంటోడు ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశాడు’’ అని చెబుతున్నాడను. 

VIDEO CREDITS: Headline Stream

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)