Breaking News

covid-19: రూల్స్‌ పాటించలేదని దేశ అధ్యక్షుడిపై కేసు

Published on Mon, 05/24/2021 - 16:40

బ్రెజీలియా: చట్టం ముందు అందరూ సమానులే అనే నిబంధనను బ్రెజిల్‌ కచ్చితంగా అమలు చేసింది.  ఎందుకంటే రూల్స్‌ పాటించలేదని ఆ దేశ అధ్యక్షుడి మీదే కేసు పెట్టారు అక్కడి అధికారులు. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా బ్రెజిల్‌ దేశం అల్లాడిన సంగతి తెలిసిందే. గతంలో విపరీతంగా కరోనా కేసులు, మరణాలు పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు ఏం చేయలేని పరిస్థితి అంటూ కంటతడి కూడా పెట్టుకున్నారు. అంతటి విధ్వంసం జరిగనప్పటికీ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బ్రెజిల్‌ అధ్యక్షుడు కోవిడ్‌ రూల్స్‌ పాటించకపోవడం అక్కడి అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిబంధనలు పాటించకపోవడం ఫలితంగా ఆయనపై కేసు కూడా నమోదు అయ్యింది.

'చబ్బీ డిక్టేటర్‌' అంటూ సంబోధించారు
వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని మారన్‌హవో రాష్ట్రంలో కరోనా వైరస్‌ కట్టడి కోసం వందమందికిపైగా పాల్గొనే సమావేశాల జరపకూడదని నిషేధం ఉంది. వీటితో పాటు మాస్క్‌ ధరించని వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మారన్‌హవో రాజధాని సావో లూయిస్‌ నగరంలో జరిగిన ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో మాస్క్‌ కూడా ధరించలేదు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వ అధినేతను 'చబ్బీ డిక్టేటర్‌' అంటూ సంబోధించారు.

దీనిపై మారన్‌హవో రాష్ట్ర గవర్నర్‌ ఫ్లావియో డైనో స్పందించారు. ఆ ప్రాంతంలో ఉన్న కోవిడ్‌ ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై అధికారులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడంతో కేసు నమోదు చేశామని గవర్నర్‌ స్పష్టంచేశారు. అయితే, అధ్యక్షుడిపై కేసు నమోదు చేసినప్పటికీ దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు 15రోజుల సమయం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: Ryanair: ‘కిటికీ తెరిచే అవకాశం ఉంటే, కిందకి దూకేవాడేమో’

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)