Breaking News

18 లక్షల సార్లు స్కిప్పింగ్‌ చేయనున్న ఏడేళ్ల బాలుడు.. ఎందుకంటే?

Published on Thu, 02/26/2026 - 00:33

బీజింగ్‌: చైనాలోని తూర్పు ప్రాంతానికి చెందిన ఏడేళ్ల టాంగ్‌డౌ తన బరువు తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

వయస్సుకు మించి బరువు పెరిగిన టాంగ్‌డౌకు అతని తండ్రి ‘హే’ స్కిప్పింగ్‌ చేయమని సలహా ఇచ్చాడు. తండ్రి వీడియో తీస్తుండగా..‘సమ్మర్ హాలిడేస్‌లో నువ్వు చెప్పినట్లే చేస్తాను నాన్న’ అని మాట ఇచ్చాడు.

అంతేకాకుండా..‘నువ్వు పోస్టు చేసే వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే, అన్ని సార్లు స్కిప్పింగ్‌ చేస్తా’అని సరదాగా చెప్పాడు. చెప్పినట్లుగా తండ్రి వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. తొలి రోజు ఆ వీడియోకి 150 లైక్స్ వచ్చాడు. లైక్స్‌కు అనుగుణంగా స్కిప్పింగ్‌ చేశాడు. రోజులు గడిచేకొద్దీ విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం ఆ వీడియోకు 18 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో,‘టాంగ్‌డౌ నిజంగా 18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా?’ అన‍్నది చైనా సోషల్ మీడియాలో చర్చాంశమైంది.

ప్రపంచ దేశాల్లో ఊబకాయం సమస్యతో బాధపడుతున్న దేశాల్లో చైనా ఒకటి. పెద్దల్లో 35 శాతం, పిల్లల్లో 12 శాతం మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టాంగ్‌డౌ వీడియో చైనాలో పేరెంటింగ్ ట్రెండ్‌గా మారింది.  

పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తల్లిదండ్రులు కొత్త పద్ధతులను ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో స్కిప్పింగ్ చేయడం శారీరకంగా సాధ్యం కాదని, ఇది కేవలం సోషల్ మీడియా వినియోగదారుల సరదా ప్రతిస్పందనగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు. 

 

 

#

Tags : 1

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)