Breaking News

బాండీ బీచ్‌ హైదరాబాదీ ‘హీరో’కు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం!

Published on Wed, 07/22/2026 - 10:14

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో గల బాండి బీచ్‌లో గత ఏడాది జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలను లెక్కచేయకుండా 20 మంది ప్రాణాలను కాపాడిన హైదరాబాద్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ రహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అరుదైన గుర్తింపును అందించింది. ఆయన సాహసాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా (పీఆర్) మంజూరు చేసింది. త్వరలోనే ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా సిడ్నీకి వెళ్లనున్నారు.

2025 డిసెంబర్‌లో సిడ్నీలోని బాండి బీచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల రహ్మత్ పాషా తూటాల వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్షతగాత్రులను రక్షించి, అంబులెన్స్‌లకు చేర్చారు. మానవతా దృక్పథంతో బాధితులకు అండగా నిలిచారు. ఈ సాహసానికి గుర్తింపుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆయనకు పీఆర్ ప్రకటించడమే కాకుండా, ఆ ఘటన రోజు ఆయన ధరించిన టోపీని సిడ్నీ మ్యూజియంలో ప్రదర్శించాలని నిర్ణయించింది.

అంతేకాకుండా పలు సాహస పురస్కారాలకు కూడా ఆయనను నామినేట్ చేసింది. ఉబర్ సంస్థతో పాటు పలువురు ఆయన సేవలను ప్రశంసించారు. అయితే, ఆ ఘటన తాలూకు భయానక దృశ్యాలు తనను ఇంకా వెంటాడుతున్నాయని, తాను తీవ్రమైన మానసిక వేదన ఎదుర్కొంటున్నానని రహ్మత్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే: నవీన్ పట్నాయక్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)