వంట కోసం బోటులో పొయ్యి వెలిగించిన మహిళ

Published on Sat, 04/19/2025 - 09:25

మధ్య ఆఫ్రికా దేశం కాంగో(Democratic Republic of the Congo)లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ భారీ బోటు అగ్నిప్రమాదానికి గురి కాగా.. 150 మందికి పైగా మృతి చెందారు. మరో వంద మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

కాంగో నార్త్‌వెస్ట్‌ రీజియన్‌లోని మటాన్‌కుము పోర్టు నుంచి బోలోంబా వైపు.. మంగళవారం వందల మందితో కూడిన భారీ చెక్కబోటు ‘హెచ్‌బీ కాంగోలో’ బయల్దేరింది. అయితే కాంగో నది మధ్యలోకి వెళ్లగానే హఠాత్తుగా బోటులో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికుల్లో చాలామంది నీళ్లలోకి దూకేశారు. ఈత కొందరు కొందరు నీట మునిగి చనిపోగా.. మరికొందరు అగ్నికి ఆహుతి అయ్యారు. చెల్లాచెదురైన మరో వంద మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది.  తీవ్రంగా గాయపడిన వాళ్లకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. 

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్మయం కలిగించే విషయం ఒకటి తెలిసిందే. ప్రయాణికుల్లో ఓ మహిళ వంట చేసేందుకు ప్రయత్నించగా.. మంటలు చెలరేగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మహిళ గ్యాస్‌ స్టౌవ్‌ అంటించగానే.. పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మరణించింది. ఇక.. కాంగోలో బోటు ప్రమాదాలు షరా మాములుగా మారిపోయాయి. 

పాతవి, పాడైపోయిన పడవలను ప్రయాణాలకు వినియోగించడం, సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కూడిన పడవ ప్రయాణాలే అందుకు కారణాలు. దీనికి తోడు ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా బోటు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిందటి ఏడాదిలో కాంగో వ్యాప్తంగా జరిగిన వేర్వేరు బోటు ప్రమాదాల్లో 400 మందికి పైనే మరణించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)