బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు: కెనడా ఆరోపణలు

Published on Tue, 10/15/2024 - 16:21

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోన్న కెనడా.. తన బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెరపైకి తీసుకొచ్చి భారత్‌పై మరోసారి తన అక్కసును వెళ్ల‌గక్కింది. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నాయని కెనడా పోలీసులు సంచలన ఆరోపలు చేశారు. ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు..  కమ్యూనిటీ ముఖ్యంగా ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకొని కెనడా భూభాగంపై పని చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి వివరాలను ది రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు సోమవారం మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్‌సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్‌ బ్రిగిట్టె గౌవిన్‌ మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కెనడాలోని దక్షిణాసియా కమ్యూనిటీని ముఖ్యంగా ప్రో-ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు. 

వీరు కొన్ని గ్రూప్‌ల సాయంతో మా భూభాగంపై వ్యవస్థీకృత నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేకించి బిష్ణోయ్‌ గ్రూప్‌ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని మేం నమ్ముతున్నాం’’ అని గౌవిన్‌ వెల్లడించారు. ఈ ఆరోపణలకు ఒట్టావా ఎలాంటి ఆధారాలను పంచుకోలేదు.

అయితే, కెనడా ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా ఆ దేశ అధికారులు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతోంది. మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్యతో ఇటీవల లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వార్తల్లో నిలిచింది. ఈ పరిణామాల వేళ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును కెనడా అధికారులు ప్రస్తావించడం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)