Breaking News

ఆగస్టు ఫస్ట్‌.. తొమ్మిది మందికీ బర్త్‌డే ఫెస్ట్‌

Published on Fri, 07/14/2023 - 03:18

ఎవరైనా ఇద్దరికి ఒకేరోజున బర్త్‌డే వస్తే.. భలే కదా అనిపిస్తుంది. అదే ముగ్గురు, నలుగురి పుట్టినరోజు ఒకే రోజున ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఒకే కుటుంబంలో అందరి బర్త్‌డే ఒకే రోజున అయితే.. అదీ ఒకరిద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది పుట్టినది ఒకే తేదీన అయితే.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సొంతం అవుతుంది. మరి అలాంటి ఓ ‘రికార్డు’ ఫ్యామిలీ గురించి తెలుసా? 

పుట్టినరోజు పెళ్లి చేసుకుని.. 
పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతానికి చెందిన మంగి అమీర్‌ అలీ, ఆయన భార్య ఖుదీజా.. ఇద్దరి పుట్టిన రోజు ఆగస్టు ఒకటో తేదీనే. దీంతో వారు 1991లో ఆగస్టు ఒకటో తేదీనే పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాదికి ఆగస్టు ఒకటినే వారికి పాప పుట్టింది. తమ పుట్టినరోజునే పాప పుట్టడంపై అమీర్, ఖుదీజా ఆశ్చర్యపోయినా.. సంబురంగా ఆమెకు సింధు అని పేరుపెట్టుకున్నారు.

కొన్నేళ్లకు సాసూ, సప్నా అనే కవల అమ్మాయిలు.. తర్వాత విడివిడిగా అమీర్, అంబర్‌ అనే ఇద్దరు అబ్బాయిలు.. ఆ తర్వాత అమర్, అహ్మర్‌ అనే కవల అబ్బాయిలు పుట్టారు. వీరంతా పుట్టినది ఆగస్టు ఒకటో తేదీనే కావడం విశేషం. అంతేకాదు.. ఏదో సిజేరియన్‌ ఆపరేషన్లతో ఇలా ఒకేరోజు పుట్టారనడానికీ లేదు. అంతా సహజ ప్రసవాలేనట.

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ ప్రతినిధులు ఈ కుటుంబం సర్టిఫికెట్లు, ప్రభుత్వ రికార్డులు అన్నీ పరిశీలించేసి.. వీరిని గిన్నిస్‌బుక్‌ లోకి ఎక్కించేశారు. ‘‘ఇలా ఒకే తేదీన అందరూ జన్మించడం మాకు భగవంతుడు ఇచ్చిన బహుమతి. ఏటా అందరం కలసి ఒకే కేక్‌ కట్‌ చేస్తాం. ఒకరికొకరు అందరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం..’’ అని అమీర్‌ పేర్కొన్నాడు.  

ఇంతకుముందు అమెరికాలో.. 
ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది బర్త్‌డే ఒకే రోజు ఉన్న రికార్డు ఇంతకుముందు అమెరికాకు చెందిన కమ్మిన్స్‌ కుటుంబం పేరిట నమోదైఉంది. 1952–66 మధ్య అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కలిపి ఐదుగురు ఫిబ్రవరి 20వ తేదీనే పుట్టారు. ఇప్పటివరకు కూడా అదే రికార్డుగా నిలవగా.. అమీర్‌ అలీ కుటుంబం దాన్ని బద్దలు కొట్టింది. 

రెండు కవల జంటల రికార్డు కూడా.. 
అమీర్‌ కుటుంబంలో సాసూ–సప్నా కవలలు, అమర్‌–అహ్మర్‌ కవలలు అంతా ఒకే తేదీన జన్మిం చారు. ఇలా ఒకే తల్లికి ఒకే తేదీన రెండు సార్లు కవలలు పుట్టడం కూడా విశేషమే. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి జననాలు నమోదవడం గమనార్హం.

– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)