జీ20 సదస్సులో ఫొటో.. బైడెన్‌, ట్రూడో మిస్సింగ్‌!

Published on Tue, 11/19/2024 - 13:43

ప్రపంచ దేశాధినేతలు కలిసి దిగిన ఓ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఈ పరిమాణం వెలుగుచూసింది. ఈ సమ్మిట్‌లో భాగంగా సోమవారం దేశాధినేతలంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఇందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తదితర నేతలంతా ఉన్నారు. వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.

అయితే ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు లేరు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సదస్సు అయినందున ఆయన లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌  గైర్హాజరు కావడం గమనార్హం. 

తాజాగా ఈ ఫోటోపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తీవ్రంగా త ప్పుబట్టారు. ఫోటో దిగే సమయంలో బైడెన్‌.. కెనడా ప్రధాని జస్టిన్‌ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. చర్చలు ముగించుకొని వస్తుండగా బైడెన్‌ రాకముందే తొందరగా ఫోటో తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫొటో దిగేశారని, అందుకే అందరూ నేతలు అక్కడ లేరని చెప్పారు. కాగాఫోటోలో మిస్‌ అయిన బైడెన్‌, ట్రూడో, మెలోనీలు తరువాత ప్రత్యేకంగా ఫొటో దిగారు.

ఇదిలా ఉండగా మరో రెండు నెలల మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు బైడెన్‌.. యూఎస్‌ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇదే చివరి జీ 20 సదస్సు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)