Breaking News

పౌరసత్వ రద్దు యోచన దారుణం: బైడెన్‌

Published on Tue, 01/07/2025 - 05:25

వాషింగ్టన్‌: అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలను అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్‌ హోదాతో నిమిత్తం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికా పౌరసత్వం కల్పిస్తోంది. ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు.  తాను అధికారం చేపట్టిన తొలి రోజే ఈ మేరకు కార్యనిర్వాహక చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. 

రాజ్యాంగబద్దమైన జన్మహక్కును మార్చాలనే ఆలోచనే దారుణమని బైడెన్‌ అన్నారు. అమెరికా జని్మంచినవాళ్లు దేశ పౌరులు కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దు నిబంధనల అమలును బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఇమిగ్రేషన్‌ బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని చట్టసభ సభ్యులను ట్రంప్‌ కోరడం హాస్యాస్పదమన్నారు.

 ట్రంప్‌కు అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతోందని బైడెన్‌ అన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం బైడెన్‌కు పగ్గాలు అప్పగించేందుకు ట్రంప్‌ ససేమిరా అనడం, అధికార మార్పిడి ప్రక్రియను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న కాపిటల్‌ హిల్‌ భవనంపై దాడికి తన మద్దతుదారులను ఉసిగొల్పడం తెలిసిందే. దాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బైడెన్‌ అభివర్ణించారు. శ్వేతజాతి ఆధిపత్య భావన అమెరికాకు పొంచి ఉన్న పెను ముప్పుల్లో ఒకటన్నారు. 

‘‘ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక దేశం మనది. అదే మన బలం కూడా. కాపిటల్‌ హిల్‌పై దాడిని మన ప్రజాస్వామ్యం తట్టుకున్నందుకు గర్వపడాలి’’అంటూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. 2021 తరహా హింసకు తావు లేకుండా ఈసారి అధికార మార్పిడి ప్రక్రియ శాంతియుతంగా సాగుతుందన్నారు. జనవరి 20న ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని కూడా బైడెన్‌ చెప్పారు. ‘‘2021లో నా ప్రమాణ స్వీకారానికి ట్రంప్‌ గైర్హాజరయ్యారు. అయినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇటీవల ఆయన్ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించా’’అని గుర్తు చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)