Breaking News

క్షమాపణ చెప్పినా బీబీసీని వదలని ట్రంప్‌

Published on Sun, 11/16/2025 - 06:04

లండన్‌: గతేడాది బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్‌ ప్రసంగాన్ని ఎడిట్‌ చేయడంతో తలెత్తిన వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై బీబీసీ డైరెక్టర్‌ జనరల్‌ టిమ్‌ డేవీ, న్యూస్‌ హెడ్‌ డెబొరా టర్నెస్‌ రాజీనామా చేశారు. బీబీసీ చైర్మన్‌ సమీర్‌ షా కూడా చెప్పారు. అయినప్పటికీ చట్ట పరమైన చర్యల కోసం కోర్టు కెళతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించారు. కనీసం కోటి నుంచి 5 కోట్ల డాలర్ల వరకు తాము పరిహారం కోరే అవకాశముందని శనివారం ఆయన తెలిపారు. ‘మోసానికి పాల్పడినట్లు బీబీసీయే ఒప్పుకుంది. కానీ, క్షమాపణలను చెప్పాల్సిన విధంగా చెప్పలేదు. వాళ్లు మోసం చేశారు.

 నేను చెప్పని మాటలను చెప్పినట్లుగా డాక్యుమెంటరీలో ప్రసారం చేశారు’అని ట్రంప్‌ ఆరోపించారు. 2021 జనవరి 6వ తేదీన ట్రంప్‌ చేసిన ప్రసంగాన్ని ఎడిట్‌ చేయడంలో పొరపాటు జరిగిందని, తామలా ఉద్దేశపూర్వకంగా చేయలేదని గురువారం బీబీసీ వివరణ ఇచ్చుకుంది. అయితే, పరిహారం చెల్లించేది లేదని తెలపడంపై ట్రంప్‌ గుర్రుగా ఉన్నారు. తాము మరోసారి ఇలాంటి తప్పిదం చేయమంటూ బీబీసీ ఇచ్చిన వివరణను సైతం ఆయన తప్పుబట్టారు. ‘మీరు చేయకపోవచ్చు, ఇతరులు చేస్తే మాత్రం ఆపరు..ఇదే కదా మీ ఉద్దేశం’అంటూ బీబీసీపై కారాలు మిరియాలు నూరారు. దావా వేయాలని తాము అనుకోవడం లేదన్న ఆయన, అలా చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)