Breaking News

Md Anwarul Azim Anwar: బెంగాల్‌లో బంగ్లా ఎంపీ హత్య

Published on Thu, 05/23/2024 - 05:03

కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఆవామీ లీగ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అన్వర్‌ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. 

నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్‌ నేత   హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్‌ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్‌చేశారు. 

కోల్‌కతాకొచ్చి కనిపించకుండాపోయి..
మే 12వ తేదీన ఎంపీ అన్వర్‌ నార్త్‌ కోల్‌కతాలోని బారానగర్‌లో తనకు పరిచయస్తుడైన గోపాల్‌ బిశ్వాస్‌ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ ఉందని చెప్పి అన్వర్‌ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్‌కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్‌ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్‌ ఫోన్‌ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్‌ చివరిసారిగా సంజీబ్‌ ఘోష్‌కు చెందిన అపార్ట్‌మెంట్‌లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్‌మెంట్‌ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్‌ రాలేదు.  అన్వర్‌ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్‌ అనుమానం వ్యక్తంచేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)