Breaking News

బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. సోషల్‌ మీడియా యాప్స్‌పై నిషేధం

Published on Sat, 08/03/2024 - 13:45

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై మళ్లీ అల్లర్లు చెలరేగడంతో ‍ప్రభుత్వం సోషల్ మీడియా యాప్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, యూట్యూబ్‌లను తాత్కాలికంగా నిషేధించింది. అయితే దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ ఐస్‌లు తమ నివేదికలలో బంగ్లాదేశ్‌లో సోషల్ మీడియా నిషేధానికి సంబంధించిన సమాచారాన్ని అందించాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, వాట్సాప్‌ తదితర ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ల వినియోగాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అదేవిధంగా గ్లోబల్ ఐస్ న్యూస్ తన అధికారిక  ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా సైట్లపై తాత్కాలిక నిషేధం విధించినట్లు గ్లోబల్ ఐస్ ఒక నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల తర్వాత మెటా ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించిన నెట్‌వర్క్‌ను పరిమితం చేసింది. ఇంటర్నెట్ స్పీడ్‌ను కూడా తగ్గించింది. ప్రధాని షేక్ హసీనాతో పాటు ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి నిరసనలు మొదలయ్యాయి. గత నెలలో ఇటువంటి ఆందోళనలు జరగగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. రిజర్వేషన్‌ కోటాపై బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కాస్త సద్దుమణిగిన నిరసనలు మళ్లీ ఇప్పుడు మొదలయ్యాయి.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)