Breaking News

నదీ జలాల భాగస్వామ్యంపై భారత్‌తో బంగ్లా చర్చలు

Published on Thu, 09/26/2024 - 07:33

ఢాకా: సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చించనుంది. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మీడియాకు తెలిపారు. 2011లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఢాకా పర్యటన సందర్భంగా, తీస్తా నీటి భాగస్వామ్యంపై భారత్‌- బంగ్లాదేశ్ ఒక ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంది. అయితే నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో నీటి కొరత కారణంగా ఈ ఒప్పందానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు.

బంగ్లాదేశ్‌ జలవనరుల సలహాదారు సైదా రిజ్వానా హసన్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు నదుల నీటి భాగస్వామ్యంపై బంగ్లాదేశ్ త్వరలో భారత్‌తో చర్చలు జరుపుతుందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాతే చర్చలు జరుపుతామన్నారు. అంతర్జాతీయ నదుల నీటిని పంచుకోవడం సంక్లిష్టమైన సమస్య అని, అయితే దీనిలో రాజకీయాలకు తావు ఉండకూడదని రిజ్వానా పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలపై ఏ దేశం కూడా ఏకపక్షంగా అంతర్జాతీయ కోర్టుకు వెళ్లదని, బదులుగా రెండు దేశాలూ వెళ్లాలని అన్నారు.

భారత్‌తో వర్షపాతం డేటాను పంచుకోవడం మానవతా  చర్య అని రిజ్వానా  పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ఈ డేటా  ఉపకరిస్తుందన్నారు.  ఈ విషయంలో బంగ్లాదేశ్ వాదనలు స్పష్టంగా, బలంగా  ఉన్నాయన్నారు. దేశంలోని అంతర్గత నదులను  సమిష్టిగా రక్షించాల్సిన  అవసరం ఉన్నదన్నారు.  కాగా ఇటీవల బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తీస్తా నీటి భాగస్వామ్య ఒప్పందంపై భారత్‌తో విభేదాలను పరిష్కరించడానికి తాత్కాలిక ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తుందని అన్నారు. 

ఇది కూడా చదవండి: చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)