Breaking News

సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ నిర్మాణం.. భారత హై కమిషనర్‌కు బంగ్లా సమన్లు

Published on Mon, 01/13/2025 - 04:43

ఢాకా: రెండు దేశాల సరిహద్దుల్లోని ఐదు ప్రాంతాల్లో ఫెన్సింగ్‌ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించిందంటూ బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ ఆదివారం ఢాకాలోని భారత హై కమిషనర్‌ ప్రణయ్‌ వర్మకు సమన్లు జారీ చేసింది. కంచె నిర్మాణం ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రణయ్‌ వర్మ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ కార్యాలయానికి వెళ్లి విదేశాంగ శాఖ కార్యదర్శి జషీముద్దీన్‌తో దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ బీఎస్‌ఎస్‌ తెలిపింది. 

ఈ పరిణామంపై అక్కడి ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సమావేశం అనంతరం హైకమిషనర్‌ వర్మ మీడియాతో మాట్లాడారు. ‘రెండు దేశాల సరిహద్దులను బీఎస్‌ఎఫ్, బీజీబీలు కాపలాకాస్తున్నాయి. ఈ రెండు విభాగాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి కూడా. సరిహద్దుల వెంట నేరాల కట్టడికి రెండు దేశాల మధ్య ఉన్న అంగీకారానికి అనుగుణంగా సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నాం’అని చెప్పారు. అంతకుముందు, బంగ్లాదేశ్‌ హోం శాఖ సలహాదారు జహంగీర్‌ ఆలం చౌదరి మీడియాతో మాట్లాడుతూ..ఒప్పందానికి విరుద్ధంగా సరిహద్దుల్లో భారత్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలను బంగ్లా జవాన్లు, స్థానికులు అడ్డుకున్నారని చెప్పారు. 1974లో కుదిరిన ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘించిందని చెప్పారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)