Breaking News

‘నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి’.. షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు!

Published on Wed, 05/28/2025 - 12:18

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతేడాది బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు తీవ్రం కావడంతో రాజీనామా చేసే ‘నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి’ అని ఆర్మీతో హసీనా అన్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.

వివరాల ప్రకారం.. గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనతో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్‌ హసీనాకు సూచించింది. ఆ సమయంలో వారితో హసీనా..‘నన్ను కాల్చి చంపేయండి.. ఇక్కడే ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి’ అని అన్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో జరిగిన విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారి తీశాయి. బంగ్లాదేశ్‌లో రాజకీయం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇదిలా ఉండగా.. బంగ్లాలో వేలాది మంది నిరసనకారులు ఆందోళన కారణంగా ప్రజా ఉద్యమానికి జడసి షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ అడ్వయిజర్‌గా నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ బాధ్యతలు చేపట్టారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)