బంగ్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం

Published on Fri, 07/24/2026 - 19:33

బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 50(3) ప్రకారం స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, గతంలో బైపాస్ శస్త్రచికిత్స, తాజాగా ఆటోనామిక్ న్యూరోపతి నిర్ధారణ కారణంగా దీర్ఘకాలిక చికిత్స అవసరమైందని లేఖలో పేర్కొన్నారు.

2024 ఆగస్టులో జరిగిన రాజకీయ సంక్షోభం అనంతరం దేశాన్ని రాజ్యాంగబద్ధంగా నడిపించడంలో తన పాత్రను సమర్థించుకున్నారు. ఆయన పదవీ కాలం 2028 ఏప్రిల్ వరకు కొనసాగాల్సి ఉండగా, మధ్యలోనే వైదొలిగారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన షహాబుద్దీన్.. ఆమెతో సీక్రెట్‌గా మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి.

షహాబుద్దీన్ రాజీనామా.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. షహాబుద్దీన్ ఈ రాజీనామాతో.. మరో ఐదు నెలల్లో తిరిగి స్వదేశానికి రావాలని భావిస్తున్న షేక్ హసీనాకు అత్యున్నత అధికార వర్గాల్లో ఇక ఏ ఒక్క మిత్రుడు కూడా మిగలనట్లయింది. 2024 నాటి తీవ్రమైన విద్యార్థి ఉద్యమం హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పటి నుండి ఆమెకు చెందిన 'అవామీ లీగ్' పార్టీపై నిషేధం విధించడమే కాకుండా..  పలువురు నాయకులు, కార్యకర్తలు జైలు పాలయ్యారు.. కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

షేక్ హసీనా పాలనా సమయంలోనే షాబుద్ధిన్‌ ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి ఉద్యమ అనంతరం  కూడా రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి ఆయనే. 2024 ఆగస్టు విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్ తిరిగి వెళ్తానని ఆమె ప్రకటించారు.

కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు జాతీయ పార్లమెంట్ (జాతీయ సంసద్) స్పీకర్ తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 17.3 కోట్ల మంది జనాభా ఉన్న బంగ్లాదేశ్‌లో దేశాధ్యక్షుడే సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించినప్పటికీ, కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధానమంత్రి, మంత్రి వర్గం చేతిలోనే ఉంటాయి.
 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)