Breaking News

బంగ్లా హిందూ నేతపై దేశ ద్రోహం కేసు

Published on Wed, 11/27/2024 - 04:20

ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయిన హిందూ నేత చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బ్రహ్మచారికి అక్కడి న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. దాస్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ రాజధాని ఢాకా, చిట్టోగ్రామ్‌ తదితర ప్రాంతాల్లో హిందువులు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఈ పరిణామాలపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన అరెస్ట్‌ తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగిపోయాయని తెలిపింది. ఇస్కాన్‌ మాజీ సభ్యుడు, సమ్మిళిత సనాతని జోత్‌ అనే హిందూ సంఘం నేత చిన్మయ్‌ కృష్ణ దాస్‌ బ్రహ్మచారి సోమవారం చిట్టోగ్రామ్‌కు వెళ్లేందుకు ఢాకా విమానాశ్రయానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిట్టోగ్రామ్‌కు తరలించారు.

చిట్టోగ్రామ్‌లోని లాల్‌డిగి మైదాన్‌లో అక్టోబర్‌ 25న హిందువులు నిర్వహించిన ర్యాలీ సందర్భంగా జాతీయ పతాకాన్ని అవమానపరిచారంటూ దాస్, మరో 18 మందిపై మాజీ ప్రధాని ఖలేదా జియాకు చెందిన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పారీ్ట(బీఎన్‌పీ)నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో చిట్టోగ్రామ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దాస్‌ను పోలీసులు మంగళవారం ఆరో మెట్రోపాలిటన్‌ మేజి్రస్టేట్‌ కాజీ షరీఫుల్‌ ఇస్లాం ఎదుట హాజరు పరిచారు. దాస్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన మేజి్రస్టేట్‌..చిట్టోగ్రామ్‌ వెలుపల ఈ అరెస్ట్‌ జరిగినందున నిబంధనల మేరకు 24 గంటలపాటు జ్యుడీíÙయల్‌ కస్టడీలో ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.

నిబంధనలకు లోబడి జైలులో మతాచారం ప్రకారం పూజాకార్యక్రమాలు జరుపుకోవచ్చన్నారు. దాస్‌ను జైలుకు తరలిస్తుండగా పెద్ద సంఖ్యలో మద్దతుదారులు నినాదాలు చేశారు. దాస్‌ను తరలిస్తున్న వ్యాన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జైలు వ్యానులో నుంచి విక్టరీ సింబల్‌ చూపుతూ దాస్‌ ప్రసంగించారు. తాము సమైక్య బంగ్లాదేశ్‌ను కోరుకుంటున్నామని చెప్పారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని, డిమాండ్లు నెరవేరాదాకా శాంతియుత పోరాటం సాగించాలని మద్దతుదారులను దాస్‌ కోరారు. ఈ మేరకు ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరలవుతోంది. పోలీసులు లాఠీచార్జీ జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు.  

దాస్‌ అరెస్ట్‌పై నిరసనలు 
దాస్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ ఢాకా, చిట్టోగ్రామ్, ఖుల్నా, దినాజ్‌పూర్, కాక్స్‌ బజార్‌ కుమిల్లా తదితర చోట్ల హిందువులు ర్యాలీలు చేపట్టారు. బంగ్లాదేశ్‌ హిందూ బుద్ధిస్ట్‌ క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ దాస్‌ అరెస్ట్‌ను ఖండించింది. దాస్‌ అరెస్ట్‌పై భారత్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు ఇతర మైనారిటీల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బంగ్లా అధికారులను కోరింది. దాస్‌ అరెస్ట్‌ను ఇస్కాన్‌ ఉపాధ్యక్షుడు రాధా రామణ్‌ దాస్‌ ఖండించారు. బంగ్లాదేశ్‌ జాతీయ జెండా కంటే ఎత్తుగా మరో జెండాను ఎగరేయడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, అంతే తప్ప అగౌరపర్చలేదని ఆయన పేర్కొన్నారు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)