Breaking News

Bangladesh: పీఎం కార్యాలయం, పోలీస్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌

Published on Tue, 07/23/2024 - 07:01

బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లపై తీవ్రమైన అశాంతి నెలకొంది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం, సెంట్రల్ బ్యాంక్, పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లు హ్యాక్‌నకు గురయ్యాయి. ‘ది ఆర్‌3 సిస్టన్స్‌3’ అనే గ్రూప్‌ ఈ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసినట్లు ప్రకటించుకుంది. ‘ఆపరేషన్ హంట్‌డౌన్, స్టాప్‌ కిల్లింగ్‌ స్టూడెంట్స్‌’ అనే సందేశం హ్యాక్‌ అయిన ఈ మూడు సైట్‌లలో కనిపించింది.

‘వీరత్వం కలిగిన విద్యార్థులు శాంతియుతంగా నిరసన చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం, దాని రాజకీయ మిత్రపక్షాలు చేసిన క్రూరమైన దాడులను వారు ఎదుర్కోవలసి వచ్చింది. ఇది కేవలం నిరసన కాదు, న్యాయం, స్వేచ్ఛ, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం’ అని హ్యాకర్లు ఆ సందేశంలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో, రిజర్వేషన్లలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇవి హింసాత్మకంగా మారాయి. ఈ హింసాయుత దాడుల్లో 100 మందికి పైగా జనం మృతి చెందారు.  మూడు వేల మందికి పైగా జనం గాయపడ్డారు.

ఈ హింసాకాండ కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. రైల్వేలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళనలను నియంత్రించడానికి ప్రధాని షేక్ హసీనా  దేశంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. నిరసనకారులు ఎవరైనా కనిపిస్తే కాల్చివేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)