Breaking News

భారత్‌లోకి చొరబడేందుకు 600 మంది బంగ్లాదేశ్‌ పౌరులు ‍యత్నం

Published on Thu, 08/08/2024 - 08:00

ఢాకా,ఢిల్లీ: ఇక్కడే ఉంటే తమకు భూమిపై నూకలు చెల్లినట్లేనని భావించిన సుమారు 600 మంది బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భారత్‌ భద్రతా బలగాలు వారిని నిలువరించాయి.  

రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్‌ అట్టుడికిపోతుంది. బంగ్లాదేశ్  ప్రధానమంత్రి పదవికి షేక్  హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ గ్రహీత మహ్మద్‌ యూనుస్‌ గురువారం (ఆగస్ట్8న)బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ ప్రకటన చేశారు. 

అయినప్పటికీ అక్కడి విధ్వంసకర పరిస్థితులు అదుపులోకి రాలేదు. అల్లరి మూకలు పేట్రేగి పోయారు. షేక్‌ హసీనా పార్టీ అవామీ లీగ్‌ మద్దతుదారుల్ని దారుణంగా హత మార్చుతున్నారు. అలా ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌లో 470 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

అల్లరి మూకల దమన కాండని ఆపేందుకు పోలీసులు తిరిగి విధుల్లోకి రావాలని, పరిస్థితుల్ని చక్కదిద్దాలని ఆ దేశ పోలీస్‌ తాత్కాలిక చీఫ్‌ షహీదుర్‌ రెహా్మన్‌ బహిరంగంగా విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది! ఆర్మీ సైతం చేతులెత్తేసింది. దీంతో షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేయడానికి, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు కారణమైన విద్యార్ధులే రంగంలోకి దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ తరుణంలో వందలాది బంగ్లాదేశ్‌ పౌరులు దేశం విడిచి పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలోని దక్షిణ్ బెరుబరి గ్రామం నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా వారిని బీఎస్‌ఎఫ్‌ భద్రతా బలగాలు నిలిపివేశాయి. బలవంతంగా భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్పులు జరపాల్సి వస్తుందని హెచ్చరించాయి. 

 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?