Breaking News

పక్కా ప్లాన్‌తో సమీర్‌ దాస్‌ను అటకాయించి..

Published on Tue, 01/13/2026 - 10:28

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికుల దాడిలో తాజాగా సమీర్‌ దాస్‌ అనే మరో హిందువు మృతిచెందారు. మీడియా కథనాల ప్రకారం.. చిట్టాగాంగ్‌లోని దాగన్‌భూయాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు తెలుస్తోంది.

సమీర్‌ దాస్‌(28) స్థానికంగా ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి అతన్నిఅడ్డగించిన గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది. అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి చంపారు. ఆపై సమీర్‌ ఆటోలోనే అక్కడి నుంచి పారిపోయారు. ఘటన జరిగిన తీరుతో ఇది ప్రీప్లాన్డ్‌గా తెలుస్తోందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. మత కోణం ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారాయన. నిందితులను గాలించేందుకు స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. అయితే.. 

అతని కుటుంబ సభ్యులు మాత్రం స్థానికులు కొందరు మతం పేరుతో తమను దూషిస్తున్నారని.. గత కొంతకాలంగా తన కొడుకును కొందరు వెంబడిస్తున్నారని అంటున్నారు. 2024లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తర్వాతి నుంచి బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలపై  దాడులు పెరిగిపోయాయి. తాజాగా సమీర్‌ దాస్‌పై జరిగిన దాడితో  కలిపి.. గత 42 రోజుల్లో 13 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదు హత్యలు కొత్త ఏడాది 13 రోజుల్లోనే జరిగాయి. 

మైనారిటీల దాడుల ఘటనలను.. బంగ్లాదేశ్‌ హిందూ బుద్ధిస్ట్‌ క్రిస్టియన్‌ యూనిటీ కౌన్సిల్‌ ఖండిస్తోంది. పిబ్రవరిలో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో మత ఘర్షణలు చోటుచేసుకోవడంపై కౌన్సిల్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. 

మైనారిటీలు.. అందునా హిందువులపై దాడులను భారత్‌ తీవ్రంగా ఖండిస్తోంది. ‘‘బంగ్లాదేశ్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడులు వ్యక్తుల మీద, అలాగే వాళ్ల నివాసాలు, వ్యాపారాలపై కూడా జరుగుతున్నాయి. తక్షణమే వీటిని నిలువరించి.. మైనారిటీలకు భద్రత కల్పించాల్సిన అవసరం అక్కడి ప్రభుత్వంపై ఉంది’’ అని భారత విదేశాంగ శాఖ గత శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.  అయితే భారత్‌ ఈ దాడులను భూతద్దంలో పెట్టి చూస్తోందంటూ యూనస్‌ ప్రభుత్వం అంటోంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)