Breaking News

Bangladesh: మోగిన ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 12న పోలింగ్‌

Published on Thu, 01/22/2026 - 11:55

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను  ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2024 ఆగస్టులో విద్యార్థుల సారధ్యంలో జరిగిన హింసాత్మక ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఈ ఎన్నికల్లో అత్యధికంగా 288 మంది అభ్యర్థులను బరిలోకి దించి, సత్తా చాటాలని నిర్ణయించింది. ఇతర ప్రధాన పార్టీలైన జమాత్-ఎ-ఇస్లామీ 224 మందిని, జాతీయ పార్టీ 192 మందిని, ఇస్లామిక్ ఆందోళన్ బంగ్లాదేశ్ పార్టీ 253 మందిని పోటీకి నిలిపాయి. మరోవైపు 249 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండటంతో పోటీ మరింత  ఆసక్తికరంగా మారింది. జమాత్-ఎ-ఇస్లామీతో పొత్తు పెట్టుకున్న నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ)32 మంది అభ్యర్థులను ప్రకటించింది.

జనవరి 22 నుంచి ఎన్నికల ప్రచారం  ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 ఉదయం 7:30 గంటల వరకు ప్రచారం కొనసాగుతుందని, ఫిబ్రవరి 12న ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా 8 లక్షల మందికి పైగా ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు వరకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎన్నికల శిక్షణ సంస్థ డైరెక్టర్ జనరల్ ముహమ్మద్ హసనుజ్జమాన్ వెల్లడించారు.

ఎన్నికల తేదీపై వస్తున్న వదంతులను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ ఖండించారు. అమెరికా మాజీ దౌత్యవేత్తలతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ముందుగా నిర్ణయించినట్లుగా ఫిబ్రవరి 12నే జరుగుతాయి.. ఒక్క రోజు ముందు కాదు, వెనుక కాదని స్పష్టం చేశారు. ఎన్నికల చుట్టూ గందరగోళం సృష్టించేందుకు ఫేక్ న్యూస్ ప్రచారం జరుగుతోందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం అప్పగించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)