Breaking News

Bangladesh: భారీ వర్షాలు, వరదలకు 20 మంది మృతి

Published on Mon, 08/26/2024 - 07:31

బంగ్లాదేశ్‌లో ఎడతెరిపి లేకుండా  భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా నదులు ఉప్పొంగి వరదలు సంభవిస్తున్నాయి. వరదల బారినపడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 52 లక్షల మందికి పైగా జనం వరదల  కారణంగా నిరాశ్రయులయ్యారని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. వీరికి ఆహారం, తాగునీరు, మందులు, దుస్తులు  అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే మారుమూల ప్రాంతాల్లో రోడ్లు  మూసుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది.

తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, పరిస్థితులు కాస్త మెరుగువుతున్నాయని అన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత యూనస్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా దేశంలోని 11 వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన 3,500 షెల్టర్లలో నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకుంటున్నారని అధికారులు తెలిపారు. 750 వైద్య బృందాలు వారికి వైద్య సహాయం అందిస్తున్నాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)