Breaking News

హసీనాకు మరో అరెస్ట్‌ వారెంట్‌

Published on Mon, 04/14/2025 - 06:24

ఢాకా: అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు బంగ్లాదేశ్‌ కోర్టు ఆదివారం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమె సోదరి షేక్‌ రెహానా, బ్రిటిష్‌ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిఖ్‌ సహా మరో 50 మంది పేర్లు పొందుపరిచింది. అధికార దుర్వినియోగంతో పుర్బాచల్‌ న్యూటౌన్‌ ప్రాజెక్టులో 10 అంతస్తుల స్థలాన్ని కొనుగోలు చేశారంటూ జనవరి 13న రెహానాపై ఏసీసీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హసీనా, రెహానా కుమార్తె బ్రిటిష్‌ ఎంపీ తులిప్‌ రిజ్వానా సిద్ధిఖ్‌ సహా 15 మందిని నిందితులుగా చేర్చారు. 

మరో 17 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేసిన ఏసీసీ మార్చి 10న సమర్పించిన తుది చార్జిషీట్‌లోలో మరో 18 మంది పేర్లు చేర్చింది. మూడు వేర్వేరు ఛార్జిషీట్లను పరిశీలించిన అనంతరం ఢాకా మెట్రోపాలిటన్‌ సీనియర్‌ స్పెషల్‌ జడ్జి జాకీర్‌ హుస్సేన్‌ ఈ ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు ఉత్తర్వుల అమలుపై నివేదికలను సమీక్షించడానికి విచారణను ఏప్రిల్‌ 27కు  వాయిదా వేశారు. 

రజుక్‌ ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన మరో అవినీతి కేసులో హసీనా, ఆమె కుమార్తె సైమా వజీద్‌ పుతుల్, మరో 17 మందిపై ఏప్రిల్‌ 10న ఇదే కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పుతుల్‌ 2023 నవంబర్‌ 1 నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హసీనాపై సామూహిక హత్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, బలవంతపు అదృశ్యాలు వంటి అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆగస్టు 5న తిరుగుబాటు అనంతరం తన ప్రభుత్వం కూలిపోవడంతో, 77 ఏళ్ల హసీనా అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు