షేక్‌ హసీనాకు బిగుస్తున్న ఉచ్చు.. మరో షాకిచ్చిన బంగ్లా సర్కార్‌

Published on Sun, 12/15/2024 - 08:16

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను మరో బిగ్‌ షాక్‌ తగిలింది. బంగ్లాలోని యూనస్ ప్రభుత్వం హసీనా టార్గెట్‌గా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే హాసీనా హయాంలో జరిగిన కొన్ని ఘటనలపై విచారణ జరుపుతోంది. వీటిపై ఐదుగురు సభ్యుల కమిషన్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాజాగా కమిషన్‌ రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

బంగ్లాదేశ్‌లో పలువురు అధికారుల అదృశ్యం, కొన్ని హత్యలపై బంగ్లా ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ మైనుల్ ఇస్లాం చౌదరి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిషన్ ‘అన్‌ఫోల్డింగ్ ది ట్రూత్’ అనే నివేదికను యూనస్‌కు అందజేసింది. ఈ కమిషన్‌ శనివారం మొదటి నివేదికను అందజేసింది. ఇందులో భాగంగా హసీనా హయాంలో మిస్సింగ్‌ కేసులపై 1,676 ఫిర్యాదులు రాగా.. 3500 మంది అదృశ్యమైనట్టు నివేదికలో పేర్కొంది. వీరిలో ప​లువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. అక్రమ అరెస్ట్‌ చేసిన కొందరు కనిపించడంలేదని, హత్యకు గురైనట్టు కూడా తెలిపింది. ఇదే సమయంలో రహస్య నిర్బంధ కేంద్రాల గురించి కూడా వెల్లడించింది. వీటన్నింటిలో హసీనా సహా పలువురు డిఫెన్స్‌ అధికారులే కారణమని బాంబు పేల్చింది.

ఇక, ఈ అంశాలపై కమిషన్‌ పూర్తి విచారణ ప్రక్రియకు మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని సభ్యులు తెలిపారు. తుది నివేదికను మార్చిలో అందించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ప్రధాని యూనస్‌ మాట్లాడుతూ.. కమిషన్‌ మొదటి మధ్యంతర నివేదికకు కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో భాగంగా కమిషన్‌ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే, విచారణలో భాగంగా తాను రహస్య నిర్భంద కేంద్రాలను, జాయింట్‌ ఇంటరాగేషన్‌ సెల్స్‌ను సందర్శిస్తానని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. కొద్ది నెలల క్రితం బంగ్లాదేశ్‌లో పౌరుల తిరుగుబాటు కారణంగా షేక్‌ హసీనా దేశం నుంచి పారిపోయి వచ్చి.. భారత్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను బంగ్లాదేశ్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు యూనస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు రకాల కేసులను పెడుతోంది. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)