Breaking News

భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్

Published on Sun, 01/05/2025 - 21:31

ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్‌ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు.  

ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌‌  న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.     

దూరం పెరిగిందా?
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. నాటి నుంచి భారత్‌- బంగ్లాదేశ్‌ల మధ్య సంబధాలు క్షీణించాయి. 

ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్‌ మాజీ ప్రతినిధి చిన్మయ్‌ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలు మార్లు బెయిల్‌ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)