Breaking News

పోలింగ్‌లో గందరగోళం.. పలుచోట్ల బ్యాలెట్‌ పేపర్లు మాయం!

Published on Thu, 02/08/2024 - 10:26

పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికల ఓటింగ్‌ ‍ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభించే ముందు బ్యాలెట్‌ పేపర్లు కలిగిన బ్యాగులను అధికారులు తెరవగా.. వాటిలో భారీ సంఖ్యలో బ్యాలెట్ పేపర్లు మాయమయ్యాయి. దీంతో పెద్దఎత్తున రిగ్గింగ్‌ జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

పలు ఎన్నికల కేంద్రాల వద్ద ప్రిసైడింగ్‌ అధికారులు బ్యాలెట్‌ పత్రాలు ఉన్న బ్యాగులను తెరిచి చూడగా వాటిలో కొన్ని చిరిగిపోయి ఉండగా, మరికొన్ని బ్యాలెట్‌ పత్రాలు కనిపించకుండా పోయాయి.
కరాచీ ఎన్నికల అధికారి దీనిపై ఉన్నతాధికారులకు  లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్‌ చేసేందుకే ఈ బ్యాలెట్‌ పత్రాలను ఎవరో మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఓటింగ్‌ ప్రారంభించేముందు పాక్‌ ఎన్నికల సంఘం ఈ బ్యాలెట్ పత్రాలను వివిధ ఎన్నికల కేంద్రాలకు పంపింది. వాటిని పంపే సమయంలో బ్యాలెట్‌ పేపర్లు చినిగిపోయిన విషయాన్ని పాక్‌ఎన్నికల సంఘం గమనించలేదా? లేక దారిలో ఎవరైనా ఇలా చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది.  కాగా
ఎన్నికలకు ఒకరోజు ముందు పాకిస్తాన్‌లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను నిలిపివేశారు. ఉగ్రవాదుల దాడులను అరికట్టేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య ప్రజలను  ఇబ్బందులకు గురి చేస్తోంది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)