Breaking News

బైదూ, ఓపెన్‌ఏఐ సేవలు ఫ్రీ

Published on Mon, 02/17/2025 - 05:22

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ చాట్‌బాట్‌ సేవలరంగంలో తొలిసారిగా భిన్నమైన పరిస్థితి నెలకొంది. వందలా కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్‌ సేవలను ‘ప్రీమియం’ వంటి ఖరీదైన చందాలు కట్టేవారికే అందిస్తున్న బైదూ, ఓపెన్‌ఏఐ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పుడు ‘ఉచిత’ జపం చేస్తున్నాయి. చైనా ఏఐ సంచలనం డీప్‌సీక్‌ తమ అత్యాధునిక ఏఐ చాట్‌బాట్‌ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తుండటంతో అవి కూడా అదే బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితులు     తలెత్తాయి. 

ఏప్రిల్‌ ఒకటి నుంచి ఉచితం! 
బీజింగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న చైనాకు చెందిన ఇంటర్నెట్‌ దిగ్గజం బైదూ ‘ఎర్నిబాట్‌’ పేరుతో ఏఐ చాట్‌బాట్‌ సేవలను అందిస్తుండటం తెలిసిందే. ఇది ఏఐ పెయింటింగ్‌ వంటి అత్యాధునిక సేవలను చందా కట్టిన ప్రీమియం కస్టమర్లకే అందిస్తోంది. ఈ సేవలను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అందరికీ ఉచితంగా అందిస్తామని బైదూ గురువారం వీచాట్‌ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అంతకు కొన్ని గంటల ముందే మరో దిగ్గజ ఏఐ సంస్థ ‘ఓపెన్‌ఏఐ’ కూడా ఉచిత సేవల అంశాన్ని ప్రకటించింది. 

తమ అధునాతన ఏఐ మోడల్‌ జీపీటీ–5ను ఉచితంగా అందిస్తామని సంస్థ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మాన్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘జీపీటీ–5ను ఇక అందరూ ఉచితంగా పొందొచ్చు. ఈ సేవల కోసం ఇప్పటికే చందా కట్టినవారికి మరింత అత్యాధునిక స్థాయి ఏఐ సేవలను అందిస్తాం’’ అని స్పష్టం చేశారు. తర్వాత బైదూ మరో ప్రకటన చేసింది. 

జూన్‌ చివరికల్లా నూతన తరం ఏఐ మోడల్‌ను తెస్తామని తెలిపింది. ఇది డీప్‌సీక్‌ ఓపెన్‌ సోర్స్‌ మోడల్‌ తరహాలో ఉంటుందని భావిస్తున్నారు. డీప్‌సీక్‌ ఆర్‌1 ఏఐ మోడల్‌ ఉచితంగా అత్యాధునిక ఏఐ చాట్‌బాట్‌ సేవలను అందిస్తుండటంతో పోటీలో నిలదొక్కుకునేందుకు ఇతర అగ్రగామి సంస్థలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉచితాల బాట పడుతున్నాయని ఏఐ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు తమ బేసిక్‌ చాట్‌బాట్‌ సేవలను ఉచితంగా అందిస్తున్నా ఖరీదైన సేవలను ఉచితం చేస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.  
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)