Breaking News

చిక్కుల్లో అందాల భామ ‘బేబీ’.. బిగుస్తున్న ఉచ్చు

Published on Thu, 09/25/2025 - 12:17

థాయ్‌ బ్యూటీ క్వీన్‌ సుపన్నీ నోయినోంతాంగ్‌(Suphannee Noinonthong) అలియాస్‌ బేబీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందాల రాణి కిరీటం దక్కిన మరుసటిరోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అందులో ఉంది తానేనని, తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె తర్వాత వివరణ ఇచ్చుకుంది. 

థాయ్‌లాండ్‌(Thailand)లో 76 ప్రావిన్స్‌కు విడివిడగా అందాల పోటీలు నిర్వహిస్తారు. ఆ 76 మంది బ్యూటీ క్వీన్లను ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్లీ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అక్కడ నెగ్గిన వాళ్లను మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ పోటీకి పంపిస్తారు.  అలా.. 27 ఏళ్ల సుపన్నీ(బేబీగా ఆమెకు పాపులారిటీ దక్కింది) ప్రాచువాప్ ఖిరీ ఖాన్‌ ప్రావిన్స్‌ నుంచి అందాల భామ గుర్తింపు దక్కించుకుంది. అయితే సెప్టెంబర్‌ 20వ తేదీన ఆమెకు కిరీటం దక్కగా.. ఆ వెంటనే ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ-సిగరెట్లు తాగుతూ, అశ్లీల నృత్యాలు.. చేష్టలతో ఆ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆ మరుసటిరోజే నిర్వాహకులు టైటిల్‌ను వెనక్కి తీసుకుని, ఆమెను డిస్‌క్వాలిఫై అయినట్లు ప్రకటించారు. 

అయితే.. ఈ పరిణామాలపై ఆమె క్షమాపణలు తెలియజేసింది. ఆ వీడియోలో ఉంది తానేనని ఒప్పుకుంది. ఈ మేరకు నిర్వాహకులను, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్‌ ఉంచింది. 

కరోనా టైంలో తన తల్లి జబ్బు చేసి మంచాన పడిందని, ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అలా అశ్లీల వెబ్‌సైట్‌కు పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే అంత చేసినా తన తల్లిని ఎంతోకాలం బతికించుకోలేకపోయానని, అప్పటి నుంచి మళ్లీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదని వివరణ ఇచ్చుకుంది. ఈ ఘటన తనకు విలువైన గుణపాఠం నేర్పిందన్న ఆమె.. జీవితంలో ఎలాంటి తప్పు చేయబోనంటూ వ్యాఖ్యానించింది. తాను బ్యూటీ క్వీన్‌ కిరీటం గెలిచిన తర్వాతే అవి బయటకు వచ్చాయని.. ఉద్దేశపూర్వకంగానే వాటిని బయట పెట్టిన వాళ్లను కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించింది. 

ఈ వివరణ తర్వాత.. పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు.. నిర్వాహకులను కలిసిన బేబీ తన టైటిల్‌ విషయంలో విజ్ఞప్తి చేసుకుంది. జాతీయ స్థాయిలో పోటీలకు అనుమతించాలని వేడుకుంది. ఈ తరుణంలో జరిగిన విచారణకు ఆమె హాజరు కాగా.. న్యాయనిపుణులు ఆమెను పలు అంశాలపై ఆరా తీశారు. అందాల పోటీల్లోని పాల్గొనే ముందు ఒప్పందంలోని ఓ క్లాజ్‌ ప్రకారం.. కంటెస్టెంట్లు అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే కాలమ్‌పై సంతకం చేయాలి. ఒకవేళ అది అబద్ధమని తేలితే వాళ్లపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయి. బేబీ తెలిసి కూడా ఆ కాలమ్‌పై సంతకం చేయడంతో.. ఆమెకు మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవశకాం ఉందని న్యాయనిపుణులు తెలిపారు. దీంతో ఆమె అందరి ముందే లబోదిబోమంది. అయితే టైటిల్‌ వెనక్కి ఇచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆమె సగం సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)