Breaking News

మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు

Published on Mon, 12/08/2025 - 13:10

వింటర్‌ చైల్డ్‌, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న   ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..

కెరిస్టీన్‌ గుర్ట్నర్‌ అనే33 ఏళ్ల  ఆస్ట్రియన్ మహిళ  39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్‌తో ఎత్తైన శిఖరం గ్రాస్‌గ్లాక్నర్‌ను అధిరోహించారు. థామస్‌ అనుభవజ్ఞుడైన గైడ్  కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు  హరికేన్-పవర్‌ విండ్స్‌ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్‌ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్‌ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.  కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్‌ను  సైలెంట్‌లో  పెట్టుకున్నాడు.  దూర​ నుంచి ఒక  హెడ్‌టార్చ్‌తప్ప ఇంకేమీ వెబ్‌ క్యామ్‌లో కనిపించలేదు.

మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా  రెస్క్యూ బృందాలు గుర్ట్నర్‌ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్‌పై  తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్‌లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్‌ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్‌గా వ్యవహరించాలని ఇన్స్‌బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్‌ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్‌బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్‌లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు.  అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్‌కు  అనేకమంది నివాళులర్పించారు.  పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు