Breaking News

కాల్‌ చేస్తే కట్‌ చేయొచ్చు

Published on Wed, 08/28/2024 - 13:11

సిడ్నీ:  ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్‌ టు డిస్‌కనెక్ట్‌’ నిబంధన అమల్లోకి వచ్చింది. 

పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్‌ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్‌ చేస్తే ఫెయిర్‌ వర్క్‌ కమిషన్‌(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. 

అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్‌ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్‌ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్‌ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్‌ పనికి అదనపు వేతనం ఉండదు.     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)