Breaking News

పెంపుడు శునకం చేతిని కొరికేసింది!

Published on Sat, 10/12/2024 - 06:03

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ ముంజేతిని ఆమె పెంపుడు కుక్క కొరికేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సగం తెగిన చేతిని వైద్యులు తిరిగి అతికించారు. తీరప్రాంత టౌన్స్‌విల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.  సాయంత్రం 7 గంటల సమయంలో అత్యవసర ఫోన్‌ కాల్‌ రావడంతో పోలీసులు వెంటనే ఓ నివాసానికి చేరుకున్నారు. 

ఓ ఇంటి బయట మహిళ రక్తం కారుతున్న చేతితో విలవిల్లాడుతుండగా, లోపల ఓ భారీ శునకం బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కోపంతో తిరుగుతోంది. దీంతో, వెంటనే పోలీసులు వైద్య  సిబ్బందికి కబురు పంపారు. వారొచ్చి బాధితురాలి చేతికి కట్టుకట్టారు. లోపలున్న శునకం నియంత్రణలోకి రాకపోవడంతో నిపుణుల సూచన మేరకు కాల్చి చంపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కుక్క గతంలో తనపైనా కూడా దాడి చేసిందని పొరుగింటి వ్యక్తి చెప్పాడని స్థానిక మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు ఇంతటి ప్రమాదకర స్థాయిలో  దాడి చేయడం తన 37 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని సీనియర్‌ సార్జెంట్‌ స్కాట్‌ వారిక్‌ వ్యాఖ్యానించారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)