Breaking News

81 ఏళ్ల తల్లి.. ఐదేళ్ల తర్వాత తొలిసారి కుమారుడితో మాటలు

Published on Fri, 10/23/2026 - 15:27

బ్యాంకాక్‌:  మయన్మార్‌ మాజీ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ (Aung San Suu Kyi)కి ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా తన కుమారుడు కిమ్‌ అరిస్‌తో ఫోన్‌లో మాట్లాడే అవకాశం లభించింది. ఈ విషయాన్ని కిమ్‌ అరిస్‌ గురువారం సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు.ఐదేళ్ల తర్వాత ఈ రోజు తన తల్లి ఆంగ్‌సాన్‌ సూకీతో మాట్లాడగలిగానని పేర్కొన్నారు. ఆమె గొంతును మళ్లీ వినడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. 

మయన్మార్‌ అధ్యక్షుడు మిన్‌ ఆంగ్‌ హ్లాయింగ్‌ ప్రతినిధి ఖైంగ్‌ ఖైంగ్‌ సో కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మయన్మార్‌ రాజధాని నేపిటాలోని ఒక రహస్య ప్రదేశంలో గృహ నిర్బంధంలో ఉన్న తన తల్లితో అరిస్‌ 20 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలిపారు. అరిస్‌ లండన్‌లోని మయన్మార్‌ రాయబార కార్యాలయం నుంచి మాట్లాడారు. 

ఇదీ చదవండి: బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్‌

ఆంగ్‌సాన్‌ సూకీ సూకీ చిన్న కుమారుడైన అరిస్‌ చాలా ఏళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. 2021 ఫిబ్రవరిలో మయన్మార్‌ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి, అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటినుంచి ఆంగ్‌సాన్‌ సూకీ సైనిక నిర్బంధంలో ఉన్నా రు. సైనిక పాలకులు ఆమెపై పలు అభియోగాలు మోపారు. న్యాయస్థానం 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021 తర్వాత ఆంగ్‌సాన్‌ సూకీ బహిరంగంగా ప్రజలకు కనిపించలేరు. సైనిక పాలకులు ఆమె ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రజలకు తెలియనివ్వడం లేదు. సూకీ వయసు ప్రస్తుతం 81 ఏళ్లు.    
ఇదీ చదవండి: రూ.800కి సేల్స్‌మేన్‌ ‌: క్లీనర్‌కి లంబోర్ఘిని ఇచ్చి, హైదరాబాదీ గొప్ప మనసు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)