Breaking News

హిందు ఉపాధ్యాయుని ఇంటికి నిప్పు

Published on Fri, 01/16/2026 - 17:16

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై విద్వేశజ్వాలలు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నసంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి హింస చెలరేగింది. అక్కడి మత ఛాందసవాదులు సిల్హట్ జిల్లాలో  హిందూ కుటుంబం ఉన్న ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో ఇది గమనించిన ఆ కుటుంబ సభ్యులు హుటాహుటీన అక్కడి నుండి పరుగు తీశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస తీవ్రరూపం దాలుస్తుంది. షేక్ హాసీనా భారత్‌లో తలదాచుకున్న మెుదలు ఏదో రకంగా అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అక్కడి విద్యార్థినేత ఉస్మాన్‌ సౌదీ మరణంతో అక్కడి మైనార్టీలపై దాడులు మరోసారి తీవ్రతరమయ్యాయి. అప్పట్నుంచి దాదాపు 42 ఘటనలు జరుగగా దాదాపు 12మందికి పైగా హిందువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలపై భారత్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అక్కడి దాడులను ఆపాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అయినప్పటికీ బంగ్లా ప్రభుత్వం స్పందించడం లేదు.

తాజాగా మరోసారి ఆ దేశంలో మత విద్వేశం చెలరేగింది. బంగ్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఓ హిందూ ఇంటికి అక్కడి అల్లరిమూకలు నిప్పంటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిల్హాట్ జిల్లా గోవైన్ ఘాట్ ఉపజిల్లా నందిర్‌గ్రామంలో బీరేంద్రకుమార్ అనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి అక్కడి మతఛాందస వాదులు నిప్పుపెట్టారు. ఇది గమనించిన ఇంటిసభ్యులు హుటాహుటీన అక్కడి నుండి ఇంటినుండి పరుగులుతీశారు. ఈవీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇస్లామిక్ గ్రూపులే ఈ దాడులు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఒక హిందువ్యక్తిని అక్కడి దుండగులు నరికి చంపగా, అక్కడి జగత్‌పూర్ అనే గ్రామంలోని పంటపొలాల్లో 27ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. బంగ్లాదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఘటనలు అక్కడి మైనార్టీలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)