Breaking News

ఉగ్రవాది అంత్యక్రియల్లో స్థానికుల తిరుగుబాటు.. తోక ముడిచిన పాక్‌ పోలీసులు

Published on Mon, 08/04/2025 - 08:39

న్యూఢ్లిల్లీ: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ ఇటీవల జరిగిన ఒక ఉగ్రవాది అంత్యక్రియల్లో యూటర్న్‌ తీసుకుంది. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌పై పలు ఆరోపణలు చేసిన పాకిస్తాన్‌ తన తీరు బయటకు పొక్కకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఒక ఉగ్రవాది అంత్యక్రియల సమయంలో చోటుచేసుకున్న పరిణామం ఇందుకు ఉదాహరణగా నిలిచింది.

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లో మరణించిన ఉగ్రవాది హబీబ్ తాహిర్ అంత్యక్రియలు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని కుయియాన్ గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఎల్‌ఈటీ కమాండర్ రిజ్వాన్ హనీఫ్ సాయుధ వ్యక్తులతో అంత్యక్రియలకు రావడంతో, తాహిర్ కుటుంబ సభ్యులు, స్థానికులు వారిని అడ్డుకున్నారు.  అయితే ఇంతలో హనీఫ్ మేనల్లుడు అక్కడ దుఃఖిస్తున్న వారిని తుపాకీతో బెదిరించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఇది స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో హనీఫ్, అతని సహచరులు పోలీసుల జోక్యంతో అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఇటీవలి కాలంలో పాక్‌లో ఉగ్రవాదులు నిర్వహించే కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఉగ్రవాద గ్రూపులు చేపట్టే ప్రజా కార్యకలాపాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని చూస్తుంటే పాక్‌ ప్రభుత్వం బహిరంగంగా ఉగ్రవాదులను ప్రోత్సహించేందుకు వెనుకడుగు వేస్తున్నదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ సమయంలో హతమైన ఎల్‌ఈటీ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఉన్నతాధికారుల పేర్లను భారతదేశం విడుదల చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు  ఎల్‌ఈటీ కమాండర్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించారని భారత్‌ ఆరోపించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)