భారీ ఉగ్రదాడితో దద్దరిల్లిన రష్యా

Published on Mon, 06/24/2024 - 06:53

రష్యాలోని దక్షిణ ప్రావిన్స్ డాగేస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. క్రైస్తవులు, యూదుల ప్రార్థనా మందిరాలపై అధునాతన ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ముష్కరుల దాడుల్లో 15 మందికి పైగా పోలీసులు, పలువురు పౌరులు మృతి చెందారని  ఆ ప్రాంత గవర్నర్  వెల్లడించారు.

ఈ కాల్పుల్లో  మృతుల సంఖ్య 15 దాటిందని సమాచారం. దాడి చేసిన వారిపై రష్యా భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపి, ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. డాగేస్తాన్ పబ్లిక్ మానిటరింగ్ కమిషన్‌కు చెందిన అధికారి షామిల్ ఖదులేవ్ మాట్లాడుతూ చర్చిపై జరిగిన దాడిలో  ఒక ఫాదర్‌తోపాటు ఆరుగురు మృతి చెందారని తెలిపారు. చర్చిలో హత్యకు గురైన ఫాదర్‌ను 66 ఏళ్ల నికోలాయ్‌గా గుర్తించారు. అలాగే చర్చికి రక్షణగా ఉన్న సెక్యూరిటీ గార్డును ముష్కరులు కాల్చి చంపారు.

ఈ ఉగ్రవాద దాడి అనంతరం యూదుల ప్రార్థనా స్థలంలో  మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. ఆదివారం మూడు చోట్ల దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. మఖచ్కల నగరంలో పోలీసుల ట్రాఫిక్ స్టాప్‌లపై దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడుల తీరు చూస్తుంటే ఇది ఒక ‍ప్రణాళిక ప్రకారం జరిగినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. డెర్బెంట్ నగరంపై దాడి జరిగిన సమయంలోనే మఖచ్కలలోని పోలీసు ట్రాఫిక్ పోస్ట్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక పోలీసు గాయపడినట్లు సమాచారం.

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)