Breaking News

దోపిడీకి వచ్చి, అందరినీ చూసి.. ‘ఇదేందిది’ అంటూ తోక ముడిచిన దొంగ!

Published on Sun, 08/20/2023 - 11:08

ఏదైనా దుకాణం లేదా స్టోర్‌లో లూటీ జరినప్పుడు అక్కడ అలజడి నెలకొంటుంది. లేదా ఆగంతకుడి చేతిలో ఆయుధం ఉంటే ఆ ప్రాంతంలో మౌనం నెలకొంటుంది. అయితే ఇటీవల అట్లాంటాలో దీనికి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఒక నెయిల్‌ సెలూన్‌లో లూటీ చేసేందుకు వచ్చిన ఆగంతకుని ఎటువంటి పరిస్థితి ఎదురయ్యిందంటే.. దానిని ఎవరూ ఊహించలేరు. 

ఈ లూటీకి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. నెయిల్‌ సెలూన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్నదాని ప్రకారం అక్కడి సిబ్బంది కస్టమర్లకు సర్వీస్‌ చేస్తున్నారు. ఇంతలో ఒక ఆగంతకుడు అరుచుకుంటూ నెయిల్‌ సెలూన్‌లోకి ‍ప్రవేశించి.. ‘అందరూ కింద కూర్చుని, నోరుమూసుకుని మీ దగ్గరున్న సొమ్ము ఇవ్వండి’ అని డిమాండ్‌ చేశాడు. ఆ ఆగంతకుని చేతిలో ఒక బ్యాగు ఉంది. దానిలో ఆ ఆగంతకుడు చేతులు పెట్టి, దీనిలో ఒక తుపాకీ ఉంది. బయటకు తీసి ఎవరినైనా కాల్చేస్తానని బెదిరించాడు. 

అయితే ఆగంతకుని అరుపులకు, బెదిరింపులకు అక్కడున్న ఎవరూ కించిత్తు కూడా భయపడలేదు. వారంతా ఎంతో రిలాక్స్‌ అవుతూ, ఫోను చూసుకుంటూ కూర్చున్నారు. అక్కడున్నవారంతా ఈ విధంగా ప్రవర్తిస్తారని ఆ ఆగంతకుడు అస్సలు ఊహించలేదు. చివరికి సెలూన్‌ యజమాని కూడా ఏ మాత్రం స్పందించకపోవడాన్ని ఆ ఆగంతకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇంతలో ఒక మహిళ తన ఫోనును బయటకు తీయగా, ఆ ఆగంతకుడు దానిని లాక్కున్నాడు. అయితే ఆమె ఏమాత్రం రియాక్ట్‌ అవకుండా మెల్లగా బయటకు వెళ్లిపోయింది. 

సెలూన్‌లో ఉన్న పరిస్థితులను చూసి ఆ ఆగంతకుడు ఉత్త చేతులతోనే బయటకు జారుకున్నాడు. ఆ సెలూన్‌ రెగ్యులర్‌ కస్టమర్‌ లీజా బోరె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో సెలూన్‌ యజమాని కొద్దిగా భయపడ్డాడని, వినియోగదారులెవరూ స్పందించలేదని, దీంతో ఆ దొంగ పారిపోయాడని తెలిపారు.
ఇది కూడా చదవండి: బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు