Breaking News

మరోమారు అమెరికా పర్యటనకు పాక్ ఆర్మీ చీఫ్?

Published on Thu, 08/07/2025 - 10:08

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోమారు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. అసిమ్ మునీర్ రెండు నెలల్లో రెండవసారి అమెరికాను సందర్శిస్తున్నారు. ఇస్లామాబాద్- వాషింగ్టన్ మధ్య సంబంధాలు మరింతగా పెరుగుతున్నాయనడానికి ఈ పర్యటన సూచికగా నిలిచింది.

సుంకాల విషయంలో అమెరికా-భారత్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ పాక్‌ ఆర్మీ చీఫ్‌ అమెరికాను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్‌తో ట్రంప్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్నందుకు శిక్షగా ట్రంప్‌ భారత్‌ ఎగుమతులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. రష్యా చమురును కొనుగోలు చేసే ఇతర దేశాలపై కూడా ఇలాంటి చర్యలే ఉంటాయని హెచ్చరించారు.

కాగా పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్ గత జూన్‌లో వాషింగ్టన్‌ను సందర్శించారు. ట్రంప్  ఆ సమయంలో అతనికి వైట్ హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారు. అప్పట్లో పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్‌.. మునీర్  మరోమారు ఈ ఏడాది చివర్లో అమెరికాను సందర్శిస్తారని పేర్కొంది.  కాగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన  ఉగ్ర దాడిలో 26 మంది మరణించిన  అనంతరం భారతదేశం తన ప్రతిదాడిని ‘ఆపరేషన్ సిందూర్’ రూపంలో చూపింది.

ఈ నేపధ్యంలో నాటి నుంచి భారత్‌- అమెరికా మధ్య సంబంధాల్లో అస్థిరత నెలకొంది.. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ పదేపదే పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వాదనను తిరస్కరించింది. ఆపరేషన్ సిందూర్‌ను ఆపివేయాలని ప్రపంచంలో ఏ దేశాధి నేతలూ తమను అడగలేదని  ప్రధాని మోదీ పార్లమెంటులో పేర్కొన్నారు. 
 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)