Breaking News

సౌదీ ప్రమాద ఘటనపై అసుదుద్దీన్ స్పందన

Published on Mon, 11/17/2025 - 15:42

సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై రియాద్ లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడానని అధికారులు ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారన్నారు. ఘటన వివరాలు సేకరిస్తున్నామని హామీ ఇచ్చారని ఎంపీ అసదుద్దీన్ తెలిపారు.

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45మంది హైదరాబాదీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా  ఈ ఘటనపై ఎంఐఏం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "ఈ ఘటనపై రియాద్ లోని ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఎంబసీతో మాట్లాడాను. ఈ ప్రమాద ఘటనపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తామని ఆయన నాకు హామీ ఇచ్చారు. అదే విధంగా ట్రావెల్ ఏజెన్సీలతో మాట్లాడి యాత్రికుల వివరాలు వారికి అందజేశాను" అని అన్నారు.  

మృతుల పార్థివదేహాలను వీలైనంత త్వరగా భారత్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని భారత ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని కోరారు. మరోవైపు సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈ విషయమై భారత అధికారులు సౌదీ అరెబీయా అధికారులతో సంప్రదిస్తున్నారని తెలిపారు.

భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ ఘటన తనను షాక్‌కు గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన సానూభూతి తెలిపారు. బాధితులకు రియాద్‌లోని ఇండియన్ ఎంబసీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు బస్సు అగ్నిప్రమాదానికి గురవగా అందులోని 45 మంది సజీవ దహనమయ్యారు. ఒక్కరు ప్రాణాలతో బయిటపడగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. మృతులంతా హైదరాబాదీ వాసులే.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)