Breaking News

నేపాల్‌కు కొత్త జీవన దేవత.. సింహాసనాన్ని అధిష్టించిన శాక్య

Published on Wed, 10/01/2025 - 07:15

ఖాట్మాండు: నేపాల్‌లో కొత్త ‘కుమారి’ (జీవన దేవత)గా రెండున్నరేళ్ల చిన్నారి ఎంపికైంది. ఆర్య తార శాక్య మంగళవారం సంప్రదాయ ‘కుమారి’ సింహాసనాన్ని అధిష్టించింది. ఖాట్మండులోని తలేజు భవాని ఆలయ పూజారి ఉద్ధవ్‌ కర్మచార్య తెలిపిన వివరాలివి. మంగళవారం శుభ ముహూర్తంలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఆర్య తార శాక్య.. అధికారికంగా ఖాట్మాండు నగరం మధ్యలో ఉన్న బసంతాపూర్‌లోని కుమారి గృహంలోకి ప్రవేశించింది.

తొలి రుతుస్రావానికి ముందే ఎంపిక 
కుమారిని శాక్య జాతి బాలికల నుండి ఎంపిక చేస్తారు. అయితే, బాలికకు మొదటి రుతుస్రావం (రజస్వల) కాకముందే ఈ ఎంపిక జరుగుతుంది. ఇంతకుముందు కుమారిగా ఉన్న బాలిక, తన 12వ ఏట మొదటి రుతుస్రావమయ్యాక ఆ బాధ్యతల నుండి ఇటీవల తప్పుకుంది. ప్రస్తుతం కుమారిగా ఎంపికైన బాలిక వయసు 2 ఏళ్ల 8 నెలలని పూజారి తెలిపారు. కుమారిగా అర్హత సాధించడానికి.. ఈ చిన్నారి కఠినమైన ఎంపిక ప్రక్రియను ఎదుర్కొంది.

ఎంపిక కఠినతరం 
కుమారిగా ఎంపికయ్యే బాలికకు రుతుస్రావం కారాదు. శరీరంపై ఎలాంటి గీతలు లేదా గాయాలు ఉండకూడదు. అన్నింటికన్నా నిర్భయంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా, ఒక చీకటి గదిలో గేదె తల, భయంకరమైన ముసుగులను ఉంచుతారు. ఆ గదిలోంచి చిన్నారి భయపడకుండా బయటకు రావాలి. కొత్త కుమారిని కొద్ది రోజుల క్రితమే ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. కుమారిని హిందువులు, బౌద్ధులు పూజిస్తారు. కుమారిని ఎంపిక చేసే శాక్య జాతిని బౌద్ధులుగా పరిగణించినప్పటికీ, కుమారిని మాత్రం హిందూ దేవతగా గౌరవిస్తారు. ఈ ద్వంద్వత్వం నేపాల్‌లో శతాబ్దాలుగా ఉన్న మత సామరస్యాన్ని సూచిస్తుంది.

500–600 ఏళ్ల క్రితం నుంచే.. 
ఈ జీవన దేవత లేదా కుమారిని పూజించే సంప్రదాయం.. మల్ల రాజుల పాలనలో సుమారు 500 నుండి 600 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే, ఖాట్మండు ప్రధాన ప్రాంతాలలో కుమారిని ఒక ప్రత్యేక రథంపై ఊరేగించే సంప్రదాయం, 18వ శతాబ్దం మధ్యలో చివరి మల్ల రాజు జయప్రకాశ్‌ మల్ల కాలంలో ప్రారంభమైంది. ఈ సమయంలోనే కుమారి కోసం ప్రత్యేక గృహమైన కుమారి ఘర్‌ కూడా నిర్మితమైంది. ఖాట్మండులోని హనుమాన్‌ధోకలో కుమారిని తలేజు దేవత మానవ రూపంగా భావిస్తారు. ప్రస్తుతం ఈ జీవన దేవత ఖాట్మండులో విదేశీ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మారింది. ఏటా ఆగస్టులో వచ్చే ఇంద్ర జాతర పండుగ సందర్భంగా, నేపాల్‌ అధ్యక్షుడు జీవన దేవతను పూజించి, ఆమె ఆశీర్వాదం పొందే సంప్రదాయం కూడా ఉంది.  

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)