Breaking News

చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్‌కే మద్దతు అని ప్రకటన

Published on Wed, 04/05/2023 - 16:48

వాషింగ్టన్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులోని 11 ప్రదేశాలకు పేర్లు పెట్టి.. ఈ భూభాగం టిబెట్‌ దక్షిణప్రాంతం అంటూ చైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ఇప్పటికే తీవ్రంగా స్పదించింది. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. 

చైనా చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తాము గుర్తిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.

ఏం జరిగిందంటే..?
అరుణాచల్‌ ప్రదేశ్‌.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా మరో దుశ్చర్యకు పాల్పడి సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్‌ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

దీనికి ప్రతిస్పందనగా భారత్‌ ఘాటుగానే బదులిచ్చింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటిచింది. అరుణాచల్‌ ప్రదేశ్‌.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే తేల్చిచెప్పింది. 'అరుణాచల్ ప్రదేశ్ భారత్‌ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు' అని ప్రకటనలో పేర్కొంది.
చదవండి: ఇంత జరిగినా అదే పాట! తీరు మార్చుకోని ట్రంప్‌.. బైడెన్‌ పాలనపై ఆరోపణలు

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)