Breaking News

సియాచిన్, గల్వాన్‌లకు సైతం  మొబైల్‌ కనెక్టివిటీ

Published on Sun, 04/20/2025 - 04:24

శ్రీనగర్‌: ప్రపంచంలోనే అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులున్న సియాచిన్, గల్వాన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లు ఇప్పుడిక తమ ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చు. లద్దాఖ్‌ ప్రాంత మంతటా హై స్పీడ్‌ మొబైల్‌ కనెక్టివిటీని ఆర్మీ అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం డిజిటల్‌ అంతరాన్ని తగ్గించడం, మారుమూల ప్రాంతాల వారికి సాధికారత కలి్పంచడం దిశగా పరివర్తనాత్మక ముందడుగుగా ఆర్మీ పేర్కొంది. 

సరిహద్దులకు అత్యంత సమీపంలోని పోస్టులున్న తూర్పు లద్దాఖ్, పశ్చిమ లద్దాఖ్‌లతోపాటు సియాచిన్‌ హిమానీనదం వరకు 4జీ, 5జీ మొబైల్‌ కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దక్షేత్రం సియాచిన్‌లో 5జీ మొబైల్‌ టవర్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశామని ప్రకటించింది. ‘అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల్లో 18వేల అడుగుల ఎత్తులోని సరిహద్దు పోస్టుల్లో పనిచేస్తున్న సైనికులకు ఈ సౌకర్యంతో మనోధైర్యం పెరుగుతుంది. 

తమ కుటుంబాలు, ప్రియమైన వారితో కనెక్ట్‌ అవ్వడానికి వీలు కలుగుతుంది’అని అధికారులు తెలిపారు. ఇందుకోసం కేవలం లద్దాఖ్, కార్గిల్‌ జిల్లాల్లోనే నాలుగు ముఖ్యమైన టవర్లు ఏర్పాటు చేశామని, ఇందులో ఆరీ్మకి చెందిన ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కార్ప్స్‌ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. బలగాలతోపాటు సరిహద్దు పోస్టులకు సమీప గ్రామాల వారు మొబైల్‌ సౌకర్యం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది వారికెంతో ఉపయోగపడుతుందన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)