Breaking News

కోర్టులో జడ్జిని కాల్చి చంపిన పోలీసు

Published on Sat, 09/21/2024 - 06:26

ఫ్రాంక్‌ఫర్ట్‌: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తి పైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బులñ æ్లట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్‌ కౌంటీలోని వైట్స్‌బర్గ్‌ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్‌ ములిన్స్‌ను ఆయన ఛాంబర్‌లోనే లెట్చర్‌ కౌంటీ షరీఫ్‌ షాన్‌ ఎం.స్టైన్స్‌ కాలి్చచంపారు. విషయం తెల్సి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. 

అసలేం జరిగిందంటే? 
గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్‌గా పనిచేస్తున్న షాన్‌ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌బర్గ్‌ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్స్‌తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్‌ షాన్‌ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్‌ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్‌ గేహార్ట్‌ శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్‌ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. షరీఫ్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)