Breaking News

ఆస్ట్రేలియాను ఇపుడు కొంటారా? సత్య నాదెళ్ల షాకింగ్‌ స్పందన

Published on Tue, 11/21/2023 - 16:28

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు పలు వేదికల మీద ప్రకటించారు. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ, తనకు టీం కృషిని, నాయకత్వాన్ని నేర్పిందని, అది కార్పొరేట్ ప్రపంచంలో కీలక మలుపులను అధిగమించడంలో  సహాయపడిందని పేర్కొన్నారు.  టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ను, అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్‌ చూశాంటూ ఇండియా విజయాన్ని ఎంజాయ్‌ చేశారు.

కానీ ఫైనల్‌లో ఇండియా ఓటమి కోట్లాదిమంది అభిమానులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా టైటిల్‌ చేజార్చుకున్న రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు  కృషిని ప్రశంసించిన  నాదెళ్ల  కప్‌ గెలుచుకున్న  ఆసీస్‌ను అభినందించారు. అలాగే అయితే తాజాగా ఒక పోడ్‌కాస్ట్‌లో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు.

కారా స్విషర్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశం ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాను కొనుగోలు చేయాలనుకుంటున్నారా  అని కారా సరదాగా ప్రశ్నించాడు.  దీనికి  నాదెళ్ల మాట్లాడుతూ  ఓపెన్‌ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదు.  అయితే  ఓపెన్‌ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్‌ను కూడా ఆ‍స్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ  క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు.

ఇది ఇలా ఉంటే చాట్‌జీపీటీ సృష్టికర్త శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పరిశోధనా సంస్థ OpenAI, సామ్ ఆల్ట్‌మన్‌ను ఆకస్మికంగా తొలగించింది. దీంతో ఆల్ట్‌మాన్‌ ఆహ్వానం పలికిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఆయన  మైక్రోసాఫ్ట్‌లో చేరుతున్నారని, అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ టీమ్‌ను ముందుండి నడిపిస్తారని  ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)