Breaking News

‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్‌ మరో షాక్‌

Published on Sat, 06/28/2025 - 09:19

న్యూఢిల్లీ: నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన ‘మధ్యవర్తిత్వ న్యాయస్థానం’ ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్‌ ఒక ప్రకటనలో  తిరస్కరించింది. స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ, పాక్‌..  నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో గల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో వెలువడిన తీర్పుపై భారత్ మండిపడింది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ న్యాయస్థానం) ఆదేశాలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన చట్టవిరుద్ధ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని తాము అంగీకరించలేదని, అయినా అది భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము, కాశ్మీర్‌లోని కిషెన్‌గంగా , రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాని సామర్థ్యంపై అనుబంధ అవార్డుగా వర్ణించే ఆదేశాల్ని ఇచ్చిందని పేర్కొంది.

కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదని, ఈ కోర్టు తీసుకునే చర్యలు, అది తీసుకునే నిర్ణయం చట్టవిరుద్ధమని, అది చెల్లదని భారత విదేశాంగశాఖ తేల్చిచెప్పేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి  అనంతరం భారత్.. అంతర్జాతీయ చట్టం ప్రకారం తన హక్కులను వినియోగించుకుంటూ,  పాక్‌ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారతదేశం మున్ముందు  ఈ ఒప్పందం ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఏ మధ్యవర్తిత్వ న్యాయస్థానం జోక్యం తమ ఉనికిలో లేదని తెలిపింది.

ఇది కూడా చదవండి: ఖమేనీ జోలికొస్తే ఖబడ్డార్‌: ట్రంప్‌కు ఇరాన్‌ వార్నింగ్‌

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)