Breaking News

పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో నిరసన

Published on Sun, 01/21/2024 - 11:33

ఇటలీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అభరణాల ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న ఇజ్రాయెల్‌ ఎగ్జిబిటర్లకు నిరసన సెగ తగిలింది. ఇజ్రాయెల్‌ వ్యతిరేక వాదులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇటలీలోని విసెంజాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ దిగారు. స్మోక్‌ బాంబులు అంటించి గందరగోళం సృష్టించారు. పోలీసులు నిరసనకారులపై వాటర్‌ క్యానన్లు ప్రయోగించారు. ‘పాలస్తీనాను వదిలేయండి.. గాజాపై బాంబుల దాడి ఆపేయండి’ అని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

40 దేశాల  నుంచి సుమారు1300 మంది ఎగ్జిబీటర్లు విసెంజాలో జరుగుతున్న అభరణాల ప్రదర్శన వచ్చారని ఎగ్జిబిషన్‌ నిర్వాకులు తెలిపారు. నిరసన కూడా ఎగ్జిబిషన్‌కు చాలా దూరంలో జరిగిందని.. నిరసన ప్రభావం ఎగ్జిబిషన్‌పై పడలేదని అన్నారు. ఎగ్జిబిషన్‌లో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎగ్జిబిటర్లు ఉన్నారా అన్న విషయంపై స్పష్టతను ఇవ్వలేదు.

ఈ నిరసనలను విసెంజా మేయర్ గియాకోమో పోస్సామై తీవ్రంగా ఖండించారు. హింస చెలరేగే విధంగా నిరసన తెలపటాన్ని పాలస్తీనాకు మద్దతు ఇచ్చినట్లుగా సమర్థించలేమన్నారు. శాంతి, కాల్పుల విరమణ కోసం నిరసనల ద్వారా హింసను ప్రేరేపించటం సరి కాదన్నారు.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు అక్టోబర్‌ 7న చేసిన మెరుపుదాడుల్లో 1140 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతి చెందారు. ఇంకా 132 మంది ఇజ్రాయెల్‌ పౌరులు హమాస్‌ చేతిలో బంధీలుగా ఉన్నారు. అక్టోబర్‌ 7 అనంతరం గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం బీకరంగా దాడుల ప్రారంభించింది. ఇప్పటికీ కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ దాడుల్లో 24,973 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు.
చదవండి:  Moon Sniper: జపాన్ ల్యాండరుకు శ్రద్ధాంజలి


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)