Breaking News

Us: అమెరికాలో మరో భారతీయుడి హత్య

Published on Sat, 02/10/2024 - 15:43

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ విద్యార్థులు,భారత సంతతికి  చెందిన వారిపై ఇటీవల తరచుగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదే కోవలో తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. వాషిం‍‍‍గ్టన్‌ డౌన్‌టౌన్‌లోని హోటల్‌ బయట రోడ్డుపై జరిగిన వాగ్వాదంలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. ఈ నెల 2న జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

భారత సంతతికి చెందిన వివేక్‌ తనేజా(41) అనే వ్యక్తి అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న ‘డైనమో టెక్నాలజీస్‌’ కో ఫౌండర్‌. వర్జీనియాలో వివేక్‌ నివాసముంటున్నారు. ఫిబ్రవరి 2న వాషింగ్టన్‌ డౌన్‌టౌన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటకు వచ్చారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం జరిగింది.

ఇది కాస్తా కొట్టుకునేదాకా రావడంతో దుండగుడు వివేక్‌ తలపై దాడి చేశాడు. వివేక్‌ను విచక్షణా రహితంగా నేలకేసి కొట్టాడు. తలకు తీవ్రంగా గాయమవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వివేక్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి.. పాక్‌లో నవాజ్‌, బిలావల్‌ ప్రభుత్వం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)